గంజాయి వినియోగం సమాజానికి చేటు: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
గంజాయి వినియోగం సమాజానికి చేటని, గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. గంజాయి ఉత్పత్తి, వినియోగం నివారించడమే లక్ష్యమని స్పష్టం చేసారు. బుధవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ నిఘాతో పాటు ప్రతీ చెక్ పోస్ట్ దగ్గర గంజాయి రవాణా నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంజాయి ఉత్పత్తి, రవాణా, వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు.