చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ఎక్సైజ్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
అనంతపురం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ పి. నాగమద్దయ్య , అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, శ్రీ రామ్ శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న చిలమత్తూరు మండలం బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆంధ్ర కర్ణాటక సరిహద్దును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వాహనాలు క్షుణ్ణగా తనిఖీ చేయాలని,కర్ణాటక రాష్ట్ర అక్రమ మద్యం రవాణా అరికట్టాలని, సిబ్బంది చెక్ పోస్ట్ నందు విధులకు హాజరు ఉండి, సక్రమంగా నిర్వహించి, మంచి ప్రతిభ కల్గిన వారికీ, కేసులు నమోదు చేసిన సిబ్బందికి రివార్డ్స్, ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.