వర్ధన్నపేట: రామారామ్ లో యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య అప్పులు ఎక్కువ అయ్యాయని మనస్థాపం
వరంగల్ జిల్లాలో యువ రైతుకు పురుగుల మందు పెరుగన్నమైంది. వేసిన మొక్కజొన్న, పత్తి పంట చేతికి రాదని ఆందోళన చెందాడు. తండ్రి నుంచి సంక్రమించిన అప్పులు తాను కూడా పెట్టుబడుల కోసం చేసిన అప్పులతో తీవ్ర మనోవేదనకు గురై తన పంట చేనులోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన వర్ధన్నపేట మండలం రామవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఉడుత అఖిల్ యువ రైతుకు తండ్రి మరణించిన అనంతరం తల్లితో కలసి తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తూ జీవిస్తున్నాడు. 5లక్షల అప్పుకావడం,ఈమధ్యకాలంలో యూరియా కొరత ఉండడంతో తరచూ యూరియా బస్తాల కోసం ఇతర గ్రామాలకు తిరుగుతుండడంతో నేడు సైతం యూరియా కోసం