శ్రీశైలం: సున్నిపెంట ప్రజల హక్కుల కోసం సొంత ఖర్చులతో సుప్రీంకోర్టు కైనా వెళ్తా: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
సుండిపెంట ప్రజల హక్కుల కోసం అఖిలపక్షంతో పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సుండిపెంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న బాధితులకు అండగా నిలుస్తామని, అవసరమైతే సొంత ఖర్చులతో సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో సుండిపెంటను గ్రామపంచాయతీగా మార్చడానికి చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.