ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా శుక్రవారం పరిశీలించారు, నామినేషన్ కేంద్రాలలో అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలు, చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రక్రియను నిర్వహించాలన్నారు