ప్రత్తిపాడు: కాకినాడ రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి - డెంకాడలో విషాదం
కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన నలుగురు భవానీ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన చెందుతున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందించాలని కోరుతున్నారు.