ఆళ్లగడ్డ: ఎర్రగుంట్ల గ్రామంలో వ్యాపారి కళ్ళుగప్పి ఆయిల్ క్యాన్ చోరీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల బస్టాండ్ సమీపంలోని రమేష్ జనరల్ స్టోర్ లో ఓ వ్యక్తి ఆయిల్ క్యాన్ చోరీ చేశాడు, సరుకులు కొనేలా నటించి వ్యాపరి కళ్ళు గప్పి ఆయిల్ క్యాన్ ను సంచిలో వేసుకొని పరారయ్యాడు, ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డు అయింది ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కొనే స్తోమత లేక ఆ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు