మడకశిర పంచాయతీలకు తక్షణమే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలి.
15వ ఆర్థిక సంఘం నిధులను మడకశిర పంచాయతీలకు విడుదల చేయాలని సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మడకశిర వైసీపీ ఇన్చార్జ్ లక్కప్ప డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. మడకశిరలో కొంతమంది అధికార పార్టీ నాయకులు సర్పంచుల ద్వారా పంచాయతీలకు ఉపయోగపడే నిధులను దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.