మహబూబాబాద్: యూరియా కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ రవీందర్ రావు..
గూడూరు మండలం బొద్దుగొండ వద్ద యూరియా కోసం ద్విచక్ర వాహనము పై వెళ్తుండగా ఇద్దరు వీరన్న,లాల్య అనే ఇద్దరు గిరిజన రైతులను నేషనల్ హైవే పై బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.వారి మృత దేహాలను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.వారి మృత దేహాలను ఆదివారం మధ్యాహ్నం 12:00 లకు ఎమ్మెల్సీ రవీందర్ రావు పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు వెంటనే పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని యూరియా లేకపోవడం వల్లనే రైతులు మృతి చెందారని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు