పుట్టపర్తిలో " బాబు షూరిటీ -మోసం గ్యారంటీ" కార్యక్రమం..ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆదివారం మధ్యాహ్నం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వైయస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో " బాబు షూరిటీ మోసం గ్యారంటీ" కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా పరిశీలకుడు రమేష్ రెడ్డి హాజరయ్యా. వైయస్సార్సీపి నాయకులతో కలిసి" బాబు షూరిటీ మోసం గ్యారంటీ " గోడ పత్రికలను విడుదల చేశారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను జనాల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలు నాయకులకు సూచించారు.