ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో విద్యార్థులకు సమయానికి బస్సు నడపాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్
విద్యార్థులకు సమయానికి బస్సు నడపాలని డిమాండ్..విద్యార్థులకు అనుగుణంగా సమయానికి బస్సు నడపాలని ఏఐఎస్ఎఫ్ నాయకుడు విజేంద్ర అన్నారు. సోమవారం ఎమ్మిగనూరులో విద్యార్థులతో కలిసి ఆర్టీసీ డిపోలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు ఆలస్యంగా వెళ్తున్నారని అన్నారు. ప్రతి రోజూ ఒక క్లాస్ మిస్ అవుతున్నారని చెప్పారు. సమయానికి బస్సు నడపాలని డిమాండ్ చేశారు.