కడప: జిల్లాలో "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి : JC అధితి సింగ్
Kadapa, YSR | Nov 27, 2025 జిల్లాలో "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (SIR–2025) కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని జేసీ అదితి సింగ్ రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్.. ఎన్నికలకు సంబంధించి ఈఆర్ఓలు, బీఎల్ఓల నియామకం, బిఎల్ఓ ఐడి కార్డుల పంపిణీ, కొత్త పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వంటి అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీసీ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ హాజరయ్యారు.