శ్రీకాకుళం: ఎచ్చెర్లలో విద్యార్థుల కోసం పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పోలీసుల ఆయుధాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు, డ్రోన్లు మరియు నేర పరిశోధన విధానాలపై అధికారులు అవగాహన కల్పించారు.