మండపేట: శిరోమండనం కేసులో న్యాయమే గెలిచింది మండపేట మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు..
శిరోమండనం కేసులో న్యాయమే గెలిచింది అని మండపేట ఎమ్మెల్యే వేగులు జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులను శిరోమండనం కేసులో 28 ఏళ్ల తర్వాత న్యాయం గెలిచిందన్నారు. న్యాయస్థానంలో శిక్షణ ఎవరూ తప్పించుకోలేరని అందుకు ఉదాహరణ ఈ సంఘటన అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు బెయిల్ పై ఉన్న ఎమ్మెల్సీ తోట ను కఠినంగా శిక్షించాలని కోరారు.