చెన్నూరు: మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాజలింగు జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మందమర్రి పట్టణంలో ఐకెపి కార్యకర్తలు సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో పరిశుభ్రతను పాటించాలని సచ్చ ఉత్సవ్ కార్యక్రమాన్ని అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఐకెపి మహిళలు పాల్గొన్నారు.