శ్రీశైలం: మా స్వామి మల్లన్న మా చెంతకే కార్యక్రమాన్ని స్థానిక చెంచుగూడెంలో ప్రారంభించిన శ్రీశైల దేవస్థాన అధికారులు
హిందూ ధర్మప్రచారంలో భాగంగా చెంచుగూడెములలో ‘మా స్వామి మల్లన్న - మా చెంతకే’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు స్థానిక మేకలబండ చెంచుగూడెంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి పీవీఎస్ నాయుడు, ఏపీడీ కెపీ నాయక్, ధర్మకర్తల మండలి సభ్యులు గుల్ల గంగమ్మ, కోడె కాంతివర్థిని, దేవస్థానం అధికారులు, సిబ్బంది మరియు ఐటిడిఎ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ బయలువీరభద్రస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.