బోధన్: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
ఎడపల్లి మండలం జమలం మాజీ సర్పంచ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి మల్లికా శ్రీనివాస్ లు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి నివాసంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దొడ్డి మల్లికా శ్రీనివాస్ లకు పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నూడా చైర్మన్ కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు.