శ్రీశైలం: వెలుగోడు తెలుగుగంగ క్వార్టర్స్‌లో రూ.3.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ అతిథి గృహం భూమి పూజ చేసిన MLA
వెలుగోడు తెలుగుగంగ క్వార్టర్స్‌లో రూ.3.69 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రభుత్వ అతిథి గృహం మరియు కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయ భవన నిర్మాణ పనులకు నేడు భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు బుడ్డా రాజశేఖర రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంతో పాటు అధికారుల పనితీరుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆయన పేర్కొన్నారు.భూమిపూజ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు