చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించిన శ్రీశైల దేవస్థానం
చెంచు గిరిజనులకు నెలలో చివరి బుధవారం ఒకరోజు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని శ్రీశైల దేవస్థానం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం చెంచు భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శన భాగ్యం కల్పించారు. గిరిజనులు మల్లన్నను స్పర్శించి, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులందరికీ అన్నపూర్ణ భవనంలో దేవస్థానం వారు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అధికారుల నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.