కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యలను వివరించేందుకు వచ్చే ప్రజలను ఎక్కువ రోజులు కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా నిర్దిష్ట కాల పరిమితితో వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.