చీమకుర్తి పట్టణంలో బాలికల సంక్షేమ హాస్టల్ నిర్మాణ పనులను వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలని సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చీమకుర్తిలో ప్రభుత్వ నూతనంగా నిర్మిస్తున్న బాలికల సంక్షేమ హాస్టల్ భవన నిర్మాణ పనులను సిపిఎం నాయకులు పరిశీలించారు. ప్రస్తుతం అద్దె భవనంలో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరైన వసతులు కూడా అద్దె భవనంలో లేవని, బాలికల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నాటికి బాలికల సంక్షేమ హాస్టల్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని సిపిఎం నాయకులు కోరారు.