గడిచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా 532.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు సోమవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా దిలావర్పూర్ మండలంలో 55.2 మి.మీ, ముధోల్ 45.6, నర్సాపూర్ జి 40, బాసర 38.0, తానూరు 37.8, కుబీర్ 32.0, సోన్ 37 మిల్లీమీటర్ల వర్షం నమోదు అయినట్లు తెలిపారు. రాబోయే రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.