సూర్యాపేట: సన్న బియ్యం ధరల సెంచరీ.. కిలో రూ.95కి చేరిన వరి ధర!
సూర్యాపేట మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిలో రూ.95 వరకు చేరడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లోనే 25 కిలోల బ్యాగ్ ధర రూ.450 వరకు పెరగడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.