హిందూపురంలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
విద్యార్థులు చదువు పట్ల దృష్టి సారించి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి చదువుపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజంలో మెలగాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో విద్యాభ్యాసం సాగించాలన్నారు. అలాంటి వారిని పనుల్లో ఉంచుకోవడం కూడా నేరమన్నారు. దీనికి తోడు 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే వాహనాలను నడపాలన్నారు. ఇందులో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలను వివరించారు. అనంతరం ఏ ఏడీజే శైలజ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల కోసం తయారుచేసిన ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.