ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి : కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఖాసీం వలి
వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కాంగ్రెస్ ఎమ్మిగనూరు నియోజకవర్గం లో వర్షాలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ ఖాసీంవలి MRO శేషఫణికి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలతో చేతికొచ్చిన వేరుశనగ, పత్తి, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు. నాయకుడు వీరేశ్ యాదవ్ పాల్గొన్నారు.