కర్నూలు: తల్లికి వందనం అర్హుడైన ప్రతి విద్యార్థికీ ఇవ్వాలి: కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు
తల్లికి వందనం పథకంలో నిబంధనలు పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులోని సుందరయ్య సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాలల అభివృద్ధి పేరుతో తల్లికి వందనంలో రూ.2 వేలు కోత విధించటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విద్యార్థులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు.