కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు, పర్యవేక్షిస్తున్న మంత్రి టూరిజం శాఖ అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్ ఫెస్టివల్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. తాజాగా కందుకూరు, కనిగిరి, పొదిలిలో 2k రన్ రన్ పేరుతో అవగాహన కల్పించారు. విశాఖలా పాకల బీచ్ను తీర్చిదిద్దుతామని మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అధికారులు, రాజకీయ నేతలు బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను చేస్తున్నారు. ఫిబ్రవరి 14 మరియు 15వ తేదీలలో బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది.