శ్రీశైలం: మహానంది మండల తహశీల్దారుగా పి.రమాదేవిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఉత్తర్వులు జారీ
మహానంది మండలం తహశీల్దారుగా పి.రమాదేవిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న ఆమెకు తహశీల్దారుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం మహానంది మండలంలో తాత్కాలిక తహశీల్దారుగా(FAC ) పనిచేస్తున్న ఆమె పదోన్నతిపై రెగ్యులర్ తహశీల్దారుగా మండలంలో విధులు నిర్వహించనున్నారు.