కుషాల్ నగర్ కాఫీ ఎస్టేట్ ను సందర్శించిన అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కాఫీ తోటలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. కర్ణాటక రాష్ట్రం కుషాల్ నగర్ ప్రాంతంలో ఉన్న టాటా కాఫీ ఎస్టేట్ ను ఆదివారం సందర్శించారు. కాఫీ తోటలకు ఎటువంటి పురుగు పట్టకుండా పెంచడానికి, దానికి సంబందించిన యంత్రాలను ఉపయోగించే విధానం, తద్వారా మార్కెటింగ్ చేయడం వంటి పద్ధతిని అభివృద్ధి పరచడానికి పర్యటించారు. పలు వివరాలను సేకరించామన్నారు.