హనుమంతునిపాడు: హనుమంతునిపాడు నుండి వేములపాడు వరకు జరుగుతున్న రహదారి మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
India | May 9, 2026
హనుమంతునిపాడు నుండి వేములపాడు వరకు జరుగుతున్న రహదారి మరమ్మత్తు పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. రహదారి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. హనుమంతునిపాడు మండలంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ఉద్దేశంతో రహదారి మరమ్మత్తు పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తానన్నారు.