శ్రీశైలం: ఇద్దరం పోటీ చేద్దాం నేను ఓడిపోతే నీ కాళ్ళ కింద దురికిపోతా, MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి కి సవాల్ విసిరిన మాజి MLA శిల్ప
శ్రీశైల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు."నేనంటే ఎమ్మెల్యే బుడ్డాకు ఎందుకు భయమో ప్రజలకు చెప్పాలి. నేను నిరసన కార్యక్రమం చేపడితే ప్రజాదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో నన్ను అడ్డుకున్నారు. పోలీసులను ప్రక్కన పెట్టి రా... నువ్వు, నేను నేరుగా పోటీ పడదాం, చూసుకుందాం. నువ్వు గెలిస్తే నేను నీ కాళ్ల క్రింద దూరిపోవడానికి కూడా సిద్ధం. లేదంటే మీ సీఎంకు చెప్పి రాజీనామా చేసి రా... ప్రజల మధ్య పోటీ చేద్దాం" అని సవాల్ విసిరారు.