కడప: ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Kadapa, YSR | Nov 27, 2025 కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అక్కడికక్కడే సూచించారు.