అశ్వారావుపేట: 21 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీవాసులు
పాల్వంచ పట్టణంలోని శివనగర్-వికలాంగుల కాలనీ వాసులు అత్యంత వైభవంగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు శుక్రవారం, అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు.ఈ సందర్భంగా భక్తులు, కమిటీ సభ్యులు కలిసి అమ్మవారిని 21 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణలో రూ. 10, 20, 50, 100, 200, 500 రూ/ నోట్లను ఉపయోగించారు.