డిసెంబర్ 17వ తేదీన వెల్దుర్తి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను జిల్లా యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 12 గంటలకు కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం అనంతరం, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి గారు, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారు కలిసి ఆవిష్కరించారు.