ఒంగోలు అర్బన్: ఐసిడియస్ నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తల భర్తీ నోటిఫికేషన్ రద్దుచేసి అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని ధర్నా
Ongole Urban, Prakasam | Aug 3, 2026
ప్రకాశం జిల్లాలో ఐసిడియస్ నిబంధనలకు విరుద్ధంగా కార్యకర్తల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి అర్హులైన హెల్పర్లకు వెంటనే ప్రమోషన్స్ ఇవ్వాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధానకార్యదర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్ చేశారు..సోమవారం ఒంగోలు ఐసిడియస్ పి. డి. ఆఫీస్ వద్ద ఎపి అంగన్వాడీ వర్కర్స్&హెల్పర్స్ యూనియన్ బాధితులైన హెల్పర్లతో కలిసి నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్స్ ఇవ్వకుండా కార్యకర్థల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం హెల్పర్లకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు.