మేడ్చల్: పోచారం: అన్నోజిగూడ వైన్ మార్ట్లో చోరీ, 53 వేల నగదు మాయం
పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్వీడీ వైన్ మార్ట్ పైకప్పు రేకులు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. క్యాష్ కౌంటర్లోని రూ.53 వేల నగదుతో పాటు పలు మద్యం బాటిళ్లు అపహరణకు గురయ్యాయి. మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.