శ్రీశైలం: వెలుగోడు పట్టణంలో నూతన ICU వార్డు మరియు మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రి నందు నూతన ICU వార్డు మరియు సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాము అని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.