ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో గని గుంతల్లో పడి మరణించిన మృతుడి ఆచూకీ లభ్యం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కోటకందుకూరు కి వెళ్లే రహదారి సమీపంలోని గని గుంతలో బుధవారం లభించిన గుర్తు తెలియని మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి, మృతుడు ఆళ్లగడ్డ పట్టణములోని రాందాస్ వీధికి చెందిన అంబవరం అక్బర్ వల్లి గా ఆళ్లగడ్డ గురువారం పట్టణ పోలీసులు గుర్తించారు, పక్షవాతంతో బాధపడుతున్న అక్బర్ వలి కాలుజారి గని గుంతలో పడి మృతి చెంది ఉండవచ్చని తన అక్క మైమూన్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు