హత్నూర: రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేపట్టాలని నరసాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ నియోజకవర్గ కొల్చారం మండలం కొంగోడు నాయిని జలాల్పూర్ అంశాన్పల్లి సీతారాం తండా అప్పాజీపల్లి పోతంశెట్టిపల్లి తండాలో ఏర్పాటుచేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్ బోనస్ 32 కోట్లను వెంటనే చెల్లించాలని, వెంటనే ధాన్యమును కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.