మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.