ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై వివక్ష, హింస, అసమానతలను తొలగించి లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక సవాళ్ళను అధిగమించడమే.. జెండర్ క్యాంపైన్ ప్రధాన ఉద్దేశ్యం అని డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2025-26 జెండర్ కాంపెయిన్ లో భాగంగా.. మంగళవారం ఉదయం జాతీయ స్థాయిలో కేంద్ర వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ జెండర్ కాంపెయిన్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ డి.బ్లాకులోని డీఆర్డీఏ సమావేశ మందిరం నుండి డిఆర్డీఏ అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు