శ్రీశైలం: మహానంది దేవస్థానం నుంచి బోయలకుంట్ల మెట్ట వరకు నిర్మించిన రహదారిని ప్రారంభించిన మంత్రి BC జనార్దన్ రెడ్డి MLA బుడ్డా
నంద్యాల జిల్లా మహానంది దేవస్థానం నుంచి బోయలకుంట్ల మెట్ట వరకు రూ.7.48 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన విస్తరణ రహదారిని రాష్ట్ర ఆర్‌అండ్‌బి, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నేడు ప్రారంభించారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో శ్రీనివాస రెడ్డి స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేశారు.