జహీరాబాద్: హౌసింగ్ బోర్డ్ కాలనీలో వ్యక్తిపై కత్తితో దాడి, ఆసుపత్రికి తరలింపు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో వ్యక్తిపై హాత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులు నివాసం ఉంటూ తినుబండారాలు అమ్ముతూ జీవనం గడుపుతున్నారు.శనివారం మధ్యాహ్నం పుతురాజ్ అనే వ్యక్తి పై మణికంఠ అనే యువకుడు డబ్బుల విషయంలో గొడవపడి కత్తితో వీపు చేతులపై పొడిచి గాయపడిచాడు. గుర్తించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, దాడి చేసిన యువకుడిని పోలీసులకు అప్పగించారు. జహీరాబాద్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.