వెంకటాపురం: సాగునీరు అందక ఎండుతున్న వరి పంటలు, ఆవేదనలో రైతులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లిలో పాలెం ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి. కాలువల మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు గోదావరిలో కలుస్తోందని, పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కాలువల మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.