ఆత్మకూరు: కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి నీటి విడుదల, పాలమూరు జిల్లాకు కొంత ఊరట
కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 1.90 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కొద్ది కాలంపాటు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. అదనంగా మరో 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన తాగునీటి పథకాలకు జూన్ వరకు ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.