శ్రీశైలం: వెలుగోడు పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం రెండు బైకులు ఎదురెదురుగా డీ ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు
వెలుగోడు పట్టణ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో వడ్ల రామాపురం గ్రామానికి చెందిన కాసారపు అశోక్ కుమార్ అనే యువకుడు ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.