శ్రీశైలం: స్వచ్ఛ పదం కార్యక్రమం కింద జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించిన DLDO అన్వరా బేగం
ప్రజా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు స్పందించి వాటి పరిష్కార మార్గాలకు కృషి చేయాలని ఆత్మకూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారిణి అన్వరా బేగం సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం బండి ఆత్మకూరులో స్వచ్ఛ పదం కార్యక్రమం కింద జరుగుతున్న పారిశుద్ధ్య పనులను డిఎల్డిఓ అన్వరా బేగం పరిశీలించారు. సచివాలయం టు ను సందర్శించి, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను, మినిట్స్ రిజిస్టర్ ను, తనిఖీ చేశారు. మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నీటి తొట్టెను ఆమె పరిశీలించారు.డంపింగ్ యార్డ్ ను సందర్శించి ఎరువుల తయారీ విషయంపై పంచాయతీ కార్యదర్శి అక్బర్ తో అడిగి తెలుసుకొన్నారు