కొత్తపేట: ఆలమూరు జడ్పిటిసి స్వతంత్ర అభ్యర్థిగా వడ్డి మణిబాబు నామినేషన్
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు జడ్పిటిసి స్థానానికి వడ్డి మణిబాబు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కలవచర్ల నుండి అమలాపురం వరకు భారీ బైక్ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.