శ్రీశైలం: పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలాంటిది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా నిలుస్తోందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం వేల్పనూరు లోని ఎమ్మెల్యే స్వగృహంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు రూ.35 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి అర్హుడికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఈ నిధి ఎంతో ఊరటనిస్తోందని, అన్నారు.