దేవరకొండ: డిండి ఆయకట్టు పంటల కోసం కల్వకుర్తి నీరు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బాలు నాయక్
డిండి ప్రాజెక్టు పరిధిలో ఎండుతున్న పంటలను కాపాడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో నీటి కొరత తీవ్రంగా ఉందని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు.